సినిమా రిలీజ్ కాకుండానే హిట్టైంది!!
on Apr 18, 2015
లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన న్యూమూవీ గంగ (కాంచన 2) తెలుగు, తమిళ్‌లో ఒకేసారి రిలీజ్ కావల్సివుండగా తమిళ్‌లో మాత్రమే రిలీజై తెలుగులో వాయిదా పడింది. ఈ సినిమా వాయిదాకు నిర్మాత బెల్లంకొండ సురేష్ కు వున్న ఫైనాన్స్ ట్రబుల్స్ ముఖ్యకారణంగా తెలుస్తోంది. గత సినిమాలాగే ఈ సినిమాకు బెల్లంకొండ ఓ ఫైనాన్షియర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో రిలీజ్ కు బ్రేక్ వేశాడని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఈ సినిమాను వచ్చే వారంలో రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారట.
శుక్రవారం తమిళ్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ఈ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. ఈ సినిమా మొదటి భాగం సూపర్ గా వుందని, సెకండాఫ్ ఒకేనని అంటున్నారు. బీ,సి సెంటర్స్‌లో మాస్ ఆడియన్స్‌ను హారర్ కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తుందని అంటున్నారు. తమిళ్ లో హిట్ టాక్‌తో రావడంతో తెలుగులో రిలీజ్‌కు అడ్డంకులు తొలుగుతాయని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద ఏంతో ఆసక్తిగా వున్నారు.మొత్తానికి గంగ (కాంచన 2) తెలుగులో రిలీజ్ కాకుండానే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.