వార్నింగ్ మీద అలీ క్లారిటీ!!
on Apr 20, 2015
వేదిక ఎక్కాడంటే అలీకి కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. మైకు పట్టుకొని.. డబుల్ మీనింగ్ డైలాగులు వల్లించేస్తాడు. సిగ్గుతో తలవొంచుకొని వచ్చీరాని నవ్వులు చిందిస్తుంటే... అదే ఎంజాయ్ మెంట్ అనుకొంటాడు అలీ! ఈమధ్య యాంకర్ సుమపై కూడా ఓ కుళ్లు జోకు పేల్చాడు. ఆ తరవాత సమంత నడుంని బెంజ్ సర్కిల్‌తో వర్కించాడు. ఈ కామెంట్లపై సుమ, సమంత సీరియస్ అయ్యారని, అలీకి వార్నింగ్ ఇచ్చారని టాక్. వీటిపై అలీ స్పందించాడు. తనకు వార్నింగులు ఇచ్చేవాళ్లు ఇంత వరకూ పుట్టలేదన్నాడు. తాను ఎలాంటివాడో పరిశ్రమకు తెలుసని, తన జోకుల్ని అందరూ ఎంజాయ్ చేస్తారని...వాళ్ల నవ్వుల కోసమే తాను అలా మాట్లాడతానని క్లియర్ గా చెప్పేశాడు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో సుమ వేదిక వెనక్కి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చింది అబద్ధమన్నాడు. 'ఈరోజు తొందరగా వెళ్లిపోవాలి..' అని సుమ చెబితే.. దాన్ని అందరూ వార్నింగ్ అనుకొంటే ఎలా అంటున్నాడు అలీ.