ఓటీటీలోకి కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on Apr 3, 2024
పెళ్ళైన తర్వాత కొంతమంది హీరోయిన్లు ఇంట్లో కూర్చోకుండా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం.. పెళ్ళి జరిగిన తర్వాత ఓ బిడ్డకి తల్లి అయిన కూడా వరుసగా సినిమాలని అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
కాజల్ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. ' లక్ష్మీ కళ్యాణం ' సినిమాతో తెరంగేట్రం చేసిన కాజల్.. మగధీర సినిమాలో రామ్ చరణ్ తో కలసి నటించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. డార్లింగ్ , నేనే రాజు నేనే మంత్రి, బృంధావనం, చందమామ, బిజినెస్ మ్యాన్, ఆర్య2, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తన సత్తా చాటుకుంది. అయితే పెళ్ళి తర్వాత చేసిన సినిమాల్లో తెలుగు సినిమాలు తక్కువే. నందమూరి బాలకృష్ణతో కలసి 'భగవంత్ కేసరి' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే తను నటించిన ఓ తమిళ చిత్రం ఓటీటీలోకి రానుంది. అదేంటో ఓసారి చూసేద్దాం. కాజల్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ' కరుంగాపియం'. కార్తికేయన్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది తమిళంలో విడుదలైంది.
ప్రస్తుతం ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ మరికొన్ని రోజుల్లో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 9 నుండి ' ఆహా' లో తెలుగులో స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. జననీ అయ్యర్, నోయిరికా, రైజూ విల్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలలో మీ ఫేవరేట్ ఏంటి? హారర్ థ్రిల్లర్ గా వచ్చే ఈ సినిమా కోసం ఎవరెవరు ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
Also Read