మాస్ గాడ్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్!
on Apr 3, 2024
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలే ఉన్నాయి. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ కి, అలాగే "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది.
బాలకృష్ణ సినిమాలు, డైలాగ్ లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో.. ఆయన సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే మూవీ టీం ఎంతో ఆలోచించి 'NBK 109'కి ఒక పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ఏదో కాదు.. 'వీరమాస్'. బాలయ్యని మాస్ గాడ్ అంటారు. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్ల దగ్గర మాస్ జాతర కనిపిస్తుంది. అలాంటిది ఇక ఆయనకి 'వీరమాస్' అనే టైటిల్ పెడితే అంచనాలు ఏ రేంజ్ కి వెళ్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం టైటిల్ కే అభిమానులు పూనకాలతో ఊగిపోయినా ఆశ్చర్యంలేదు. త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
Also Read