బన్నీ సాంగ్‌ను రీమేక్ చేయడం సల్మాన్‌కు ఇది ఫస్ట్ టైమ్ కాదు!
on May 1, 2021
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ బాయ్'లో విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ సీటీమార్ యూట్యూబ్‌లో సూపర్ హిట్టయింది. ఐదు రోజుల క్రితం రిలీజ్ చేసిన దగ్గర్నుంచీ ట్రెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఇప్పటిదాకా దానికి 61 మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం. అది 'దువ్వాడ జగన్నాథమ్' మూవీలోని సూపర్ హిట్ సాంగ్ సీటీమార్‌కు రీమేక్. ఒరిజినల్‌కు మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీప్రసాద్, 'రాధే' కోసం మరోసారి కొత్తగా ఆ ట్యూన్స్ కట్టాడు. అయితే ఒరిజినల్లో అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్స్ వేశాడో మనకు తెలుసు. అలాంటి క్లిష్టమైన, మెరుపుల్లాంటి మూవ్మెంట్స్ ఇవ్వడం సల్మాన్‌కు సాధ్యమయ్యే విషయం కాదు. ఆ విషయం హుందాగా ఒప్పేసుకున్నాడు సల్మాన్. ఏదేమైనా 'సీటీమార్' ట్రాక్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోందనడానికి 'రాధే'లోని రీమేక్ సాంగ్ ఓ నిదర్శనం.
కాగా, బన్నీ సాంగ్‌ను రీమేక్ చేయడం సల్మాన్‌కు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇదివరకు కూడా ఆయన ఓ సాంగ్‌ను ఇలాగే రీమేక్ చేశాడు. అది.. 'ఆర్య 2' మూవీలోని 'రింగ రింగ' సాంగ్. దానికి కూడా దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఐటమ్ సాంగ్‌గా దాన్ని డైరెక్టర్ సుకుమార్ తీశాడు. అల్లు అర్జున్, ఎరినా ఆండ్రియానాపై ఆ సాంగ్‌ను చిత్రీకరించారు.
ఆ బ్లాక్‌బస్టర్ సాంగ్‌ను 'రెడీ' మూవీలో 'ఢింక చిక ఢింక చిక' పేరుతో రీమేక్ చేశారు. దానికి మ్యూజిక్ ఇచ్చింది కూడా దేవినే. మూవీలో ఆ సాంగ్‌ను హీరో హీరోయిన్లు సల్మాన్, అసిన్‌పై చిత్రీకరించారు. ఆ సాంగ్‌ను ఇంతదాకా 105 మిలియన్ల మంది పైగా వీక్షించారు.
దీన్ని బట్టి దేవి శ్రీప్రసాద్ బాణీలను సల్మాన్ ఎంతగా ఇష్టపడతాడో అర్థం చేసుకోవచ్చు. సందర్భవశాత్తూ దేవి 'ఆర్య' కోసం కట్టిన 'అ అంటే అమలాపురం' సాంగ్‌ను అదే పేరుతో 'మాగ్జిమమ్' అనే హిందీ సినిమాలో రీమేక్ చేశారు. తెలుగులో అభినయశ్రీపై ఆ పాటను తీస్తే, హిందీలో ఆ సాంగ్‌ను హాజెల్ కీచ్ (ప్రస్తుతం యువరాజ్ సింగ్ భార్య)పై తీశారు.
Also Read