ఎన్టీఆర్‌తో... 150కోట్ల బడ్జెట్‌తో!
on May 9, 2020
‘కెజిఎఫ్’ విడుదలకు ముందు దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు తెలుగు ప్రేక్షకులెవరికీ పెద్దగా పరిచయం లేదు. సినిమా విడుదల తర్వాత అతను ఎవరంటూ ఆరాలు తీశారు. ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను, సినిమా ప్రముఖులను ప్రశాంత్ నీల్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘కెజిఎఫ్’ సీక్వెల్ తెరకెక్కిస్తున్న ఆయన, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడం దాదాపు ఖరారు అయిందని సమాచారం. పాన్ ఇండియన్ లెవల్లో సినిమా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ‘అరవింత సమేత వీరరాఘవ’ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు ఎన్టీఆర్ చేసే లోపు, ‘కెజిఎఫ్ 2’ సినిమాను ప్రశాంత్ నీల్ పూర్తి చేసి, పూర్తి కథతో రెడీ అవుతారట. పాన్ ఇండియన్ లెవల్లో సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని ఆయన ప్లానింగ్‌లో ఉన్నారట. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండొచ్చని టాక్. ఈ సినిమా అనౌన్స్ చేసినా, చేయకున్నా... ఆ రోజు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ రావడం పక్కా. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా కాబట్టి దానిపై కూడా భారీ అంచనాలు ఉంటాయి. ఆ సినిమానూ దేశవ్యాప్తంగా విడుదల చేయవచ్చు ఏమో!
Also Read