పిచ్చి కాకపోతే ఇంట్లో కూర్చుని షాపింగ్ చేస్తామా?
on May 9, 2020
ఎప్పుడైనా సరే షాపుకు వెళ్లి నచ్చినవి కొనుక్కోవడమే ఇష్టమని అనసూయ అన్నారు. ఈమధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ పదం ఎక్కువ వినిపిస్తోంది. వినిపించడం కాదు... చాలామంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు కూడా! అంతెందుకు కాయగూరలు, కందిపప్పు, ఉప్పు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. అనసూయకు అటువంటి ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇష్టం లేదట. "ఇంట్లోనే కూర్చుని రెడీ అయి షాపింగ్ చేద్దామా? పిచ్చి కాకపోతే! నాకు ఆన్ లైన్ షాపింగ్ అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు" అని అనసూయ అన్నారు.
ఎదుటివ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవడం తనకు ఇష్టం లేదని అనసూయ వ్యాఖ్యానించారు. "నేను ఎందుకు తెలుసుకోవాలి? బయటకు చెప్పడానికి గట్స్ లేనప్పుడు, వాళ్ళు మనసులో ఏం ఆలోచిస్తున్నారో నేనెందుకు తెలుసుకోవాలి?" అని అనసూయ అన్నారు. డబ్బు కావాలా? ఫేమ్ కావాలా? ఏదో ఒకటి ఎంచుకోమంటే ఆవిడ తడబడ్డారు. "రెండూ ముఖ్యం కాదు. లేదంటే రెండూ ముఖ్యమే ఏమో?" అన్నారామె. తనకు ఇష్టమైనవి కొన్ని చెప్పారు.
బంగారం కంటే అనసూయకు వెండి అంటే ఇష్టం. ఆవిడ చెప్పిన మాటే ఇది. ఇక, ఎప్పుడైనా తనకు చల్లటి వాతావరణమే ఇష్టమని అన్నారు. సినిమాలు చూడడం కంటే పుస్తకాలు చదవడానికి తన ఓటు అని అనసూయ చెప్పారు. టీ కంటే కాఫీ ఎక్కువ తాగుతానని చెప్పుకొచ్చారు. అదీ సంగతి!