Home

»

Latest News

హీరోయిన్‌గా కేజీఎఫ్‌ మదర్: ఎమోషన్ నుంచి రొమాన్స్‌కి షిఫ్ట్.!

Nov 5, 2026 5:50PM

‘కేజీఎఫ్’ సినిమాలో యశ్ తల్లిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కన్నడ నటి అర్చనా జోయిస్. ఆ సినిమాలో ఆమె నటన, ముఖ్యంగా రాఖీ భాయ్‌ చిన్నప్పటి ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి అర్చనా జోయిస్ ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. అర్చనా జోయిస్ హీరోయిన్‌గా అలరించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అతిథి మైకల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేయగా.. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సినిమాతో దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండు మనసుల మధ్య పుట్టే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా వినోదాత్మక అంశాలను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

ఇది కూడా చదవండి: రామాయణ మూవీ రివ్యూ!

ఇక ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న అర్చనా జోయిస్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపించారని, ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమెకు ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరి ‘కేజీఎఫ్’లో ఎమోషనల్ తల్లిగా గుర్తుండిపోయిన అర్చనా జోయిస్.. ఈసారి తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
ట్విన్ సిస్టర్స్‌తో రొమాన్స్.. ఒకరిని ప్రేమించి మరొకరితో.?
టైటిల్స్‌పై సెన్సార్ ఫోకస్: విడుదలకు ముందు సినిమాలకు మళ్ళీ బారసాల.!

 

 

 

[Archana Jois Heroine Debut, KGF Actress Archana Jois, Archana Jois Telugu Debut, Archana Jois, Vijay Raj Kumar, Divakar Yedla, Telugu Movies 2026, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com