'గ్రాండ్‌మా'లో సోనియా అగర్వాల్ ఫస్ట్ లుక్ ఔట్!
on Nov 23, 2021

సోనియా అగర్వాల్, విమలా రామన్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'గ్రాండ్‌మా'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా షిజిన్‌లాల్ యస్.యస్. ఇతర కీలక పాత్రల్లో చార్మిళ, హేమంత్ మీనన్, బాలనటి పౌర్ణమి రాజ్ నటిస్తున్నారు. సోనియా ఈ మూవీలో టీచర్‌గా మెయిన్ లీడ్ చేస్తోంది. మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ను ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోనియా షేర్ చేశారు. ఆ పోస్టర్‌లో సోనియా చేతిలో నెత్తురు కారుతోన్న కత్తి పట్టుకొని, నడుస్తూ వుంది. బ్లాక్ కలర్ టాంక్ టాప్, జీన్స్ ధరించిన ఆమె నడుముకు కోటును ముడేసి కట్టుకుంది. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది.
ఆద్యంతం ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలతో సినిమా నడుస్తుందని డైరెక్టర్ చెప్పాడు. "కేరళలోని కొండ ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ జరిపారు. ఇది రొటీన్ హారర్ మూవీ కాదు. ఇప్పుడొస్తున్న హారర్ కామెడీ లాంటిది కాదు. హాలీవుడ్ స్టైల్ హారర్ మూవీగా దీన్ని రూపొందించాం. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాముఖ్యం ఉంది. క్లైమాక్స్‌లో సోనియా చేసే యాక్షన్ హైలైట్ అవుతుంది" అని అతను తెలిపాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



