జానీ మాస్టర్ పై సినీ నటి ఝాన్సీ పోస్ట్
on Jan 29, 2025
.webp)
లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.బయటకి వచ్చిన వెంటనే పలు సందర్భాల్లో మాట్లాడుతు నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని,కోర్టులో అదంతా ప్రూఫ్ చేసుకుంటాననే ధీమాని వ్యక్తం చేస్తు వస్తున్నాడు.జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti Verma)కూడా,కొన్ని రోజుల నుంచి పలు ఇంటర్వ్యూ లలో మాట్లాడుతు రివేంజ్ కోసం కేసు వెయ్యలేదు.ఆత్మ గౌరవం కోసం వేసిన కేసు.నాకు జరిగిన అన్యాయానికి తప్పుకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్తు వస్తుంది.
ఇక జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలతో ఫిల్మ్ ఛాంబర్ అతడి మీద బ్యాన్ విధించింది.ఆ బ్యాన్ ని సవాలు చేస్తు జానీ మాస్టర్ కోర్టుకి వెళ్లడం జరిగింది. ఈ విషయంపై రీసెంట్ గా ప్రముఖ నటి ఝాన్సీ(Jhansi)'వాయిస్ ఆఫ్ ఉమెన్' నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ బాషా కేసు వేసాడు.ఇప్పుడు ఆ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.ఇది ఒక గొప్ప తీర్పు.పని చేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని,POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఇచ్చేలా ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ వేసింది.
ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలవగా, ఆ పోస్ట్ కి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.ఝాన్సీ దాదాపు మూడు దశాబ్దాల నుంచి సినీ రంగంలో ఉంది.సుమారు అరవై సినిమాల దాకా చేసిన ఝాన్సీ యాంకర్ గాను టి వి రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.ఫిలిం ఛాంబర్ లో ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతు ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



