ఫాతిమా సనా షేక్ పై లైంగిక వేధింపులు జరిగాయి
on Jan 28, 2025

అమీర్ ఖాన్ హీరోగా 2016 లో వచ్చిన మూవీ దంగల్.క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నేటికీ ఇండియాలోనే నెంబర్ వన్ కలెక్షన్ సాధించిన మూవీ గా నిలిచిందంటే 'దంగల్' సాధించిన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.ఈ మూవీలో అమీర్ కూతురు గీతా పొగట్ క్యారక్టర్ లో 'ఫాతిమా సనా షేక్'(Fatima Sana Sheck) అద్భుతంగా నటించి అశేష ప్రేక్షాభిమాన్ని పొందింది.దాంతో సుమారు 15 చిత్రాల దాకా చేసింది. ప్రస్తుతం కూడా రెండు బడా ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
రీసెంట్ గా ఫాతిమా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు బాలీవుడ్ కంటే ముందే నాకు సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చింది.దీంతో ఆ చిత్ర నిర్మాత ని హైదరాబాద్ లో కలిసాను. సినిమా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పాడు.నేను కూడా సినిమా కోసం ఏం చేయడానికి రెడీ అని చెప్పాను.కానీ ఆ తర్వాత గాని తెలియలేదు.ప్రొడ్యూసర్ మాట్లాడింది క్యాస్టింగ్ కౌచ్ గురించి అని.దాంతో మౌనంగా ఆ సినిమా నుంచి బయటకి వచ్చేసాను.వాటన్నింటిని దాటుకొని,ఒక వేళ ఆఫర్ వచ్చినా కూడా రిఫరెన్స్ పేరుతో రెమ్యునరేషన్ లో నిర్మాతలే 10 శాతం కమీషన్ తీసుకుంటారని చెప్పుకొచ్చింది.
ఫాతిమా తెలుగులో తెరకెక్కిన 'నువ్వు నేను ఒక్కటవుదాం'అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది.2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో రంజిత్ సోమి హీరోగా చెయ్యగా గుర్రాల కృష్ణారెడ్డి నిర్మాతగాను, నర్సింహా రెడ్డి దర్శకుడుగాను వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



