బాలయ్య పచ్చ ఉంగరంపై రచ్చ..!
on Jan 29, 2025
కొన్నేళ్లుగా నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. ఆయన పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హీరోగా వరుసగా నాలుగు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అలాగే ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇటీవల ఆయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ కూడా లభించింది. ఇలా ప్రస్తుతం బాలయ్య టైం బ్రహ్మాండంగా ఉంది. అయితే, ఒక ఉంగరమే దీనంతటికీ కారణమనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. (Nandamuri Balakrishna)
సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లు ఎక్కువ. ఇక బాలకృష్ణకు అయితే సెంటిమెంట్ లు, దైవభక్తి అన్నీ ఎక్కువే. సినిమా షూటింగ్ అయినా, రాజకీయ కార్యక్రమమైనా.. ముహూర్తం చూసుకొని మొదలుపెడతారు. మంచి ముహూర్తానికి మొదలుపెడితే.. అంతా మంచే జరుగుతుంది అనేది ఆయన నమ్మకం. అందుకు తగ్గట్టుగానే.. సినీ, రాజకీయ రంగాల్లో తనకు తిరుగేలేదు అన్నట్టుగా బాలకృష్ణ కొన్నేళ్లుగా దూసుకుపోతున్నారు. అయితే కేవలం ముహూర్తం బలమే కాకుండా, దీని వెనుక ఉంగరం మహిమ కూడా ఉందని అంటున్నారు. బాలయ్య కొంతకాలంగా కుడిచేతి బొటనవేలికి పచ్చ రత్నం ఉంగరం ధరిస్తున్నారు. అప్పటినుంచే ఆయన కెరీర్.. జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది అనే ప్రచారం ఉంది. (Balakrishna Ring)
పచ్చ రత్నం ఉంగరానికి ఎంతో డిమాండ్ ఉంది. ముఖ్యంగా వ్యాపార, సినీ, రాజకీయ రంగాలకు చెందినవారు దీనికి ధరిస్తూ ఉంటారు. ఈ ఉంగరం ధరించడం వల్ల వృత్తి పరంగా ఎంతో వృద్ధి ఉంటుందని నమ్ముతారు. ఆవు పాలు మరియు గంగాజలంతో ఉంగరాన్ని శుద్ధిచేసి.. "ఓం బం బుధాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ధరిస్తారు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మంచి వక్త అవుతారు. తెలివి తేటలు పెరుగుతాయి. అంతా శుభమే జరుగుతూ.. ఎంతో వృద్ధి సాధిస్తామని చెబుతారు. ఈ పచ్చ రత్న ఉంగరం విశిష్టత తెలిసిన బాలకృష్ణ.. దానికి ప్రత్యేకంగా తెప్పించి, శుద్ధి చేసి ధరించారట. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణ విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనకు తాజాగా పద్మభూషణ్ ను ప్రకటించిందని అంటున్నారు.
మనం ఎంత కష్టపడినా, దానికి తగ్గ సరైన గుర్తింపు రావాలంటే కాస్త అదృష్టం తోడవ్వాలి. ఆ అదృష్టం బాలయ్యకు పచ్చ రత్నం ఉంగరం రూపంలో వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఉంగరం గురించి జరుగుతున్న చర్చను తప్పుబడుతున్న వారు కూడా ఉన్నారు. బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. రాజకీయ, సేవా రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా పద్మభూషణ్ వరించింది. అలాంటిది బాలకృష్ణ పాజిటివ్ వైబ్ కోసమో లేక సెంటిమెంట్ కోసమో ధరించిన ఉంగరం ఖాతాలో.. పద్మభూషణ్ క్రెడిట్ వేసేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)