విమానంలో బాబుగారి రొమాన్స్
on Sep 7, 2016
ఆయన హీరోగా బోలెడన్ని సినిమాలు చేశారు. మాస్ మసాలా, ఫ్యామిలీ డ్రామా, దేశభక్తి చిత్రాలు ఇలా చాలా చాలా చేశారు. ఆ తరవాత.. క్యారెక్టరు ఆర్టిస్టుగా మారిపోయారు. ఇప్పుడూ బాగానే సంపాదిస్తున్నారు. కాకపోతే బాబుగారు భలే రొమాంటిక్. మామూలు రొమాంటిక్ కాదు... వీర రొమాంటిక్కే అనుకోవాలి. హీరోగా ఓ రేంజులో సినిమాలు చేస్తున్నప్పుడు ఈయనపై చాలా చాలా పుకార్లొచ్చేవి. ఈయన కూడా కేర్ లెస్‌గా వాటిని విని వదిలేశాడు. హీరోయిజం వదిలేసినా.. హీరోయిన్లని పటాయించడం మాత్రం మానలేదు. రొమాంటిక్ యాంగిలూ వదల్లేదు. ఈమధ్య ఆకాశంలో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అనే చిలిపి ఆలోచన పుట్టిందట. వెంటనే ఓ ప్రైవేటు విమానం బుక్ చేసి.. విహార యాత్రకు వెళ్లొచ్చారు బాబుగారు! విమానంలో చక్కర్లు కొడుతూనే అచ్చిక బుచ్చికలు ఆడుతున్నార్ట. కాకపోతే ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచార్ట. కానీ... అలా ఇలా ఏదోలా బయటకు వచ్చేసిందీ హాట్ సీక్రెట్. గెడ్డం మెరుస్తున్నా, మనోడు చిలిపిపనులేం మానలేదు... అని బాబుగారి గురించి తెలిసినవాళ్లంతా ముసిముసిగా నవ్వుకొంటున్నారు. ఆ బాబుగారెవరన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయనెవరో గెస్ చేశారా??.