'జబర్దస్త్'తో కరోనాకి లింకేంటి? క్లాస్ పీకిన రష్మీ
on Mar 18, 2020
‘‘కరోనా, జబర్దస్త్... ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న సమస్యలు అనుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే ముందు ఆలోచించడం నేర్చుకోండి. రెండోది... ఏదైనా డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మీ చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చోపెట్టలేదు’’ అని యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్‌లో ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆమె ఆగ్రహానికి కారణం ఉంది. కరోనా గురించి నలుగురికీ నాలుగు మంచి మాటలు చెప్పాలని ట్విట్టర్‌లో రష్మీ పోస్టులు చేశారు. ఇతర చేసినవీ రీట్వీట్ కొట్టారు. అయితే... కరోనా కాదు, ‘జబర్దస్త్’ను నిషేధించాలని కొందరు కామెంట్స్ చేశారు. డబుల్ మీనింగ్ డైలాగులను, బాడీ షేమింగ్‌ను ‘జబర్దస్త్’లో ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక నెటిజన్ అయితే ‘మీరు బంతులు చూపిస్తున్నారు’ అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. సదరు కామెంట్స్‌పై రష్మీ మండిపడ్డారు. గట్టిగా క్లాస్ పీకారు.
‘‘మేం ఊపుకుంటూ డ్యాన్స్ చేసినప్పుడు మీరు కళ్లు మూసుకోవచ్చు. లేదా ఛానల్ మార్చుకోవచ్చు. ఒక షో హిట్ అవ్వడానికి ప్రముఖ కారణం ఆడియన్స్, వ్యూవర్‌షిప్. ఆడియన్స్ మమ్మల్ని, మా షోని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ముందు చెప్పిన రెమిడీ ఫాలో అవ్వచ్చు’’ అని రష్మీ గౌతమ్ సెలవిచ్చారు. కామెంట్స్ చేసేవాళ్లకు ఇంకో ఛాయిస్ కూడా ఇచ్చారు. ‘‘మీరు సినిమా నిర్మించడానికి ముందుకొచ్చి, నాకు సతీ సావిత్ర రోల్ ఇచ్చే వరకూ... నేను చేసే పనిని క్వశ్చన్ చేయవద్దు. నాకు వచ్చిన ఛాన్సుల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా’’ అని రష్మీ అన్నారు.