థియేటర్స్ బంద్ కానున్నాయా???
on Feb 20, 2019
పెరిగిన సాంకేతికత, మారిన ట్రెండ్ ప్రకారం థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ తగ్గారనడంలో సందేహం లేదు. అందుకే సినిమా థియేటర్ల బంద్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురులో సీడెడ్ కు చెందిన ఇద్దరు నిర్మాతలు ఆ ఏరియాలో భారీగా థియేటర్స్ కలిగి ఉన్నారు. వీళ్లు క్రమక్రమంగా థియేటర్లను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనాదరణ ఉన్న థియేటర్ల వరకూ ఓకే కానీ, సరిగా ఫీడింగ్ లేకపోతే ఆ థియేటర్లు తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు థియేటర్లు రాబడి తగ్గడం ఎగ్జిబీటర్లలో ఆందోళన పెంచుతోందట. ఏదైనా ఫెస్టివల్ వస్తే ఆ సమయాల్లో థియేటర్లకు సమస్య లేదు కానీ, మిగతా సమయాల్లో మాత్రం మెయింటెనెన్స్ కూడా రావట్లేదట. మరోవైపు ఇటీవల మాల్స్ లో పార్కింగ్ ఫీజును తీసివేయడం తో ఆ మేరకు భారీగా ఆదాయం పడిపోయిందట. ఇన్ని సమస్యల కారణంగా మార్చిలో థియేటర్స్ బంద్ కు పిలుపునివ్వాలని థియేటర్స్ యాజామాన్యాలు ఆలోచిస్తున్నారట. నైజాంలో కూడా ఈ బంద్ ఉండే అవకాశాలు ఉన్నాయట. ఇదే జరిగితే సమ్మర్ లో వచ్చే సినిమాలకు థియేటర్స్ సమస్య వచ్చే అవకాశాలు లేకపోలేదు. సంవత్సరానికి 150 సినిమాలకు పైగా సినిమాలు నిర్మిస్తున్నా థియేటర్స్ కు సరైన ఫీడింగ్ ఉండటం లేదని ఎగ్జిబీటర్స్ ఒకవైపు వాపోతున్నారు. మల్టీప్లెక్స్ కు వచ్చే ఆదాయం సాధారణ థియేటర్స్ కు ఉండటం లేదట. అందులో టిక్కెట్స్ రేట్స్ కూడా పెరగడం కూడా ఓ సమస్యగా చెబుతున్నారు. చూద్దాం మార్చిలో ఎలా ఉండబోతుందో.