ఎన్టీఆర్ న్యూలుక్ అందుకేనా..?
on Nov 15, 2016
జనతా గ్యారేజ్ గ్రాండ్ విక్టరీ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఏ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కనీసం ఫలానా వారితో చర్చలు నడుస్తున్నాయి అని కానీ..అవి అలా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎన్టీఆర్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. అయితే ఎన్టీఆర్ అల్రెడి ఎదో సినిమాకు కమిట్ అయ్యాడంటూ ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె రిసెప్షన్‌లో గుబురు గడ్డాన్ని ట్రీమ్ చేసి, కోరమీసంతో న్యూలుక్‌తో దర్శనమిచ్చాడు జూనియర్. ఎన్టీఆర్ గెడ్డంతో కనిపించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.. టెంపర్‌లో సిక్స్ ప్యాక్ బాడీతోనూ..ఆ తర్వాత నాన్నకు ప్రేమతోలో డ్రెస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు టాప్ టూ బాటమ్ గెటప్ మార్చేసిన ఎన్టీఆర్..రీసెంట్‌గా వచ్చిన జనతా గ్యారేజ్‌లో ఫుల్ క్లాస్ లుక్‌తో పాత్రలో ఒదిగిపోయాడు. అలాంటి జూనియర్ ఇప్పుడు కోరమీసంతో కనిపించే సరికి దాని వెనుక కారణమేమై ఉంటుందోనని ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.