‘బిగ్ బాస్’లో ప్రిన్స్.. ఆదర్ష్ మధ్య ఏం జరిగింది?
on Sep 11, 2017
‘బిగ్ బాస్’ ఫాలో అవుతున్న చాలామంది.. అనుకున్నదొకటైతే... అదివారం జరిగింది ఇంకోటి. అసలు ప్రిన్స్ వెళ్లడం చాలామందికి మింగుడు పడని విషయం. చివరివరకూ మిగిలే ఇద్దరిలో ప్రిన్స్ ఉంటాడని ఎక్కువమంది అంచనా వేశారు. కొందరైతే.. ప్రిన్సే ఈ బిగ్ బాస్ విజేత అని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చేశారు. బయట జనాల సంగతి అటుంచితే.. చివరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి... వెళ్లిపోతున్న కేండిడెట్లు సైతం... ‘ బిగ్ బాస్ విజేత ఎవరనుకుంటున్నారు?’ అని ఎన్టీయార్ అడిగితే... ఎక్కువ మంది చెప్పిన సమాధానం కూడా ‘ప్రిన్స్’ అనే. కానీ... అందరికీ షాక్ ఇస్తూ... ఈ ఆదివారం జనాలు ‘ప్రిన్స్’ని నామినేట్ చేసేశారు. పాపం.. తను వెళ్లిపోతుంటే చాలామంది బాధ పడ్డారు కూడా. అంతెందుకు సోషల్ మీడియాలోనే ప్రిన్స్ బయటకు రావడంపై విచారం వ్యక్తం అవుతోంది.
ఆటను సిస్టమేటిగ్గా ఆడటం కూడా ప్రిన్స్ వెళ్లిపోవడానికి కారణం అయ్యిందని, ప్రిన్స్ వెళ్లిపోవడంతో ‘బిగ్ బాస్’లో వినోదం తగ్గిపోవడం ఖాయమని, ముఖ్యంగా హౌజ్ లో రొమాన్స్ కనబడదని కూడా కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు. అసలు ప్రిన్స్ ఎందుకు వెళ్లిపోయాడు? ప్రిన్స్ కీ.. ఆదర్స్ కీ మధ్య ఏం జరిగింది? జనాలు కూడా వీళ్లద్దరినే ఈ ఆదివారం టెర్గెట్ చేయడానికి కారణం ఏంటి? అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఎన్టీయార్ కూడా ఆదివారం షోలో ఆదర్ష్ ని టార్గెట్ చేశాడు. ప్రిన్స్ కూడా ఆదర్ష్ విషయంలో అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను ఆదర్ష్ వల్లే బయటకు వచ్చాను’ అని అందరి ముందు చెప్పాడు కూడా.
అసలు వారి మధ్య ఏం జరిగిందనేది ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆదర్ష్ కూడా ప్రిన్స్ ని అడిగాడు. ఎన్టీయార్ ని ప్రాధేయపడ్డాడు. కానీ... వచ్చేవారమే చెబుతాన్నాడు జూనియర్. నిన్న ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ ఎండింగ్ లో ఆదర్ష్ నిజంగా బాధగా కనిపించాడు. అసలు ఏం జరిగింది? మరి సంశయాలకు సమాధానం కావాలంటే.. వచ్చేవారం దాకా ఆగాల్సిందే. ఏది ఏమైనా ‘ప్రిన్స్’ రూపంలో ఓ గట్టి పాటిస్పెంట్ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడం ఇప్పుడు పెద్ద చర్చగానే మారింది.