పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన వర్మ
on Sep 30, 2015
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు.ఈ సారి ఏకంగా పవన్ అభిమానులను టార్గెట్ చేశాడు. ట్విట్టర్ లో మహేశ్ బాబుకు 15 లక్షల మంది ఫాలోయిర్స్ ఉంటే... పవన్ కళ్యాణ్ కు 6 లక్షల మంది ఫాలోయిర్స్ మాత్రమే ఉండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ట్వీట్ చేసిన వర్మ... అంతటితో ఆగకుండా పవన్ ఫ్యాన్స్ పై విపరీత వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కు ఇంత తక్కువ ఫాలోయిర్స్ ఉండటానికి కారణం... ఆయన ఫ్యాన్స్ లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్లు ఉన్నారేమో అని తనకు అనిపిస్తోందని కామెంట్ చేశాడు. అంతేకాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్న పవన్... ముందుగా ట్విట్టర్ విషయంలో తన ఫ్యాన్స్ కు అవగాహన కల్పించలేరా అని ప్రశ్నించాడు. పవన్ అభిమానులు ఇతరులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలంటూ పవన్ వీరాభిమానినైనా తాను కోరుకుంటున్నానని ట్వీట్ ద్వారా తెలియజేశాడు. మరి... రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ట్వీట్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.