ప్రముఖ హీరోయిన్ సోదరుడి హత్య.. భార్య చెప్పిన నిజం ఇదే
on Aug 8, 2025

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth),పా రంజిత్(Pa Ranjith)కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'కాలా'. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలైన ఈ చిత్రం ద్వారా, తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి హుమా ఖురేషి. (Huma Qureshi)ప్రస్తుతం యష్(Yash)అప్ కమింగ్ మూవీ టాక్సిక్ లోను కీలక పాత్ర పోషిస్తుంది.
హుమా ఖురేషి సోదరుడు పేరు 'ఆసీఫ్ ఖురేషి'(Asif Qureshi).ఢిల్లీలో నివాసం ఉంటుంటాడు. నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఆసిఫ్ ఇంటి వద్ద ఒక వ్యక్తి స్కూటీని పార్క్ చేసాడు. దీంతో స్కూటీని తీసేయాలని ఆసిఫ్ కోరగా, పార్కింగ్ చేసిన వ్యక్తి ఒప్పుకోలేదు. చివరకి ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో స్కూటీ పార్కింగ్ చేసిన వ్యక్తి, మరికొంత మందితో కలిసి ఆసిఫ్ పై పదునైన ఆయుధాలతో దాడి చేసాడు. ఆసిఫ్ రక్తపు మరకలతో అక్కడిక్కడే కుప్పకూలిపోవడంతో చుట్టుపక్కలవాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ ఆసిఫ్ అప్పటికే చనిపోయినట్టు డాక్టర్స్ ధ్రువీకరించారు.
ఈ హత్య విషయంపై ఆసిఫ్ భార్య మాట్లాడుతు పార్కింగ్ విషయంలోనే గొడవ జరిగిందని, స్కూటీ ని పార్క్ చెయ్యవద్దని అన్నందుకే చంపేశారని కన్నీరుమున్నీరవుతుంది. పార్కింగ్ గొడవకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



