ENGLISH | TELUGU  

'మేజర్' ఫస్ట్ సింగిల్ 'హృదయమా' రిలీజ్ చేసిన మహేష్ బాబు

on Jan 7, 2022

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా 'మేజర్' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

మేజర్ సినిమా నుండి హృదయమా అంటూ సాగే ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అడివి శేష్, సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట సాగుతుంది. వారు తమ ప్రేమను లేఖల ద్వారా వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇక ఈ లిరికల్ వీడియోలో వారిద్దరి చిన్న నాటి జ్ఞాపకాలను కూడా చూపించారు. ఈ పాటలో మేజర్, ఇషాల మధ్య ప్రేమను అద్భుతంగా చూపించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.