ENGLISH | TELUGU  

కొవిడ్ థ‌ర్డ్ వేవ్ దెబ్బ‌కు 'లైగ‌ర్' షూటింగ్ కేన్సిల్‌! ఇంటికొచ్చేసిన విజ‌య్‌!!

on Jan 7, 2022

 

క‌రోనావైర‌స్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా త‌న సినిమా 'లైగ‌ర్' షూటింగ్ కేన్సిల్ అయ్యింద‌ని రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపాడు. హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లో పెట్ డాగ్‌తో పాటు కూర్చొని ఉన్న ఒక ఫొటోను శుక్ర‌వారం షేర్ చేసిన అత‌ను, "స్ప‌ష్టంగా ఇది మ‌రో తుపాను అల‌. షూట్స్ కేన్సిల్డ్‌. ఇంటి ద‌గ్గ‌ర చిల్ అవ‌డానికి తిరిగొచ్చాం" అని రాసుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ న‌టిస్తోన్న మొదటి పాన్-ఇండియన్ ఫిల్మ్ 'లైగ‌ర్‌'. దీన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో చిత్రీక‌రిస్తున్నారు. కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు, మేకర్స్ ఈ మూవీలో విజ‌య్ క్యారెక్ట‌ర్ తీరును వెల్ల‌డించే టీజర్‌ను విడుదల చేశారు.

Also read: నితిన్ ప్రేమని అడ్డుకోలేకపోయిన కరోనా!

ముంబై వీధుల్లో టీ అమ్ముతూ జీవనం సాగించే యువ‌కునిగా 'లైగ‌ర్‌'లో విజ‌య్ క‌నిపించ‌నున్నాడు. అయినప్పటికీ, అత‌నిలో ఒక నింజా యోధుని కుండే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉంటాయి. ఆ త‌ర్వాత అతను అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పాల్గొనడం ద్వారా డబ్బుకి డ‌బ్బు, పేరుకి పేరు సంపాదించడానికి తన ప‌రాక్ర‌మాన్నీ, ఫైటింగ్ స్కిల్స్‌నూ ఉపయోగించుకుంటాడు.

Also read: పవర్ స్టార్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ లో అడుగుపెట్టిన పవన్!

దేవరకొండ మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌ ఫైటర్ పాత్రలో నటించడానికి పూర్తిగా ప్రిపేర‌య్యాడు. తన పాత్ర కోసం, అతను ఆ యుద్ధ‌ కళలో కూడా ప్రావీణ్యం సంపాదించినట్లు అనిపించింది. గత సంవత్సరం, బాక్సింగ్ గ్రేట్ మైక్ టైసన్‌తో కొన్ని యాక్ష‌న్ సీన్ల‌ను తియ్య‌డానికి యూనిట్ స‌భ్యులు లాస్ వెగాస్‌కు వెళ్లారు .

ఆగ‌స్టులో 'లైగ‌ర్‌'ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే కొవిడ్ కేసుల కార‌ణంగా ప్రొడ‌క్ష‌న్‌లో జాప్యం జ‌రుగుతుండ‌టం వ‌ల్ల రిలీజ్ డేట్‌లో మార్పు జ‌రుగుతుందేమో చూడాలి. అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, రోణిత్ రాయ్‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, విషురెడ్డి కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.