ఓటీటీ వైపుగానే విక్రమ్ `కోబ్రా`!
on Jan 7, 2022

ఒకవైపు చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్ లో `పిజ్జా` కెప్టెన్ కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించిన `మహాన్` చిత్రం రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఇంకోవైపు విక్రమ్ నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఓటీటీ బాటలోనే వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `డిమాంటి కాలనీ`, `ఇమైక్కా నొడిగళ్` (తెలుగులో `అంజలి సీబీఐ`) వంటి జనరంజక చిత్రాలను తీర్చిదిద్దిన ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కింది. ఆ చిత్రమే.. `కోబ్రా`. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్స్ లో దర్శనమివ్వనున్నారు. `స్వర మాంత్రికుడు` ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రంలో `కేజీఎఫ్` భామ శ్రీనిధి శెట్టి నాయికగా నటించగా.. మాజీ భారతీయ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. అంతేకాదు.. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు బజ్. త్వరలోనే `కోబ్రా` స్ట్రీమింగ్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే `మహాన్`, `కోబ్రా`.. ఇలా ఈ రెండు చిత్రాలను కూడా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



