పాపకు దెబ్బలు తగిలాయట
on Aug 27, 2015
ఈమధ్య హీరోయిన్లు సైతం యాక్షన్ సీన్స్‌లో తలమునకలైపోతున్నారు. రామ్‌చరణ్ సినిమా కోసం రకుల్ ఫైట్స్ చేసిందట. ఇప్పుడు డైనమైట్ కోసం ప్రణీత కూడా అదే పని చేసింది. విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత కథానాయిక. హీరోయిన్ అంటే పాటల్లో, కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి వెళ్లిపోవడం కాదు, ఈ కథలో ప్రణీత పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. అంతేకాదు, ఛేజింగ్ సీన్స్‌లో, యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొందట. ఈ షూటింగ్ సమయంలో తనకు దెబ్బలు కూడా తగిలాయని, మరీ ముఖ్యంగా మోకాళ్లు కొట్టుకుపోయాయని చెప్తోంది. యాక్షన్ సీన్స్‌లో నటించడం అంత తేలిక కాదని, చిన్న చిన్న సీన్లకే తనకు చెమటలు పట్టాయని, పెద్ద పెద్ద ఫైట్స్‌ని హీరోలు ఎలా చేస్తారో అని ఆశ్చర్యపోతోంది ప్రణీత. హీరోల కష్టం... ప్రణీతకు ఇలా తెలిసొచ్చిందేమో..?