కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు
on Aug 27, 2015
పటాస్ కు ముందు హీరో కళ్యాణ్ రామ్ భారీ నష్టాలలో వున్నాడు. ఆ తరువాత పటాస్ దెబ్బకి ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చేసాడు. ఈ టైంలో అతను నిర్మాతగా, తొలిసారి బయటహీరోతో ఓ సినిమా చేసి రిలీజ్ చేశాడు..అదే కిక్ 2 సినిమా. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతీసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమా దెబ్బకి మళ్ళీ నష్టాల బాటలోకి వెళ్లినట్టు సమాచారం. రవితేజ మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల ఖర్చు చేశాడట. దీంతో కిక్ 2కి పదికోట్ల వరకు లాస్ రావడం ఖాయమని, ఇంకా ఓ ఐదు పెరిగే ఛాన్స్ లు కూడా వున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. పటాస్ తో వచ్చిన సంతోషం పది నెలలు కూడ నిలవలేదని.. ఇప్పుడు రికవరీ కావాలంటే ఎన్టీఆర్ అదుకోవాలని అంటున్నారు.