‘అఖిల్’ సినిమా 'అఖిల్'..ఫస్ట్ లుక్ అదిరింది
on Aug 27, 2015
అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. అక్కినేని అభిమానులను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. అక్కినేని అభిమానుల అంచనాలను మించిపోయే రెంజులో వున్నాయి ఫస్ట్ లుక్ పోస్టర్లు. కథానాయకుడి అసలు పేరునే సినిమాకు టైటిల్ గా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా, ఆసక్తికరంగా మారింది. ''లో యాంగిల్ లో ఎంతో డైనమిక్ గా అఖిల్ ను చూపిస్తూ.. చేతిలో ఒక ఫైర్ బాల్ దాని నుండి ఏదో మెరుపులాంటి ఒక సెగ తో తొలి పోస్టర్ లో అఖిల్ ను ఎంతో సూపర్బ్ గా సూపర్బ్ గా చూపించాడు వినాయక్.
నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 29న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయాల్సి ఉండగా రెండు రోజుల ముందే రిలీజ్ చేసి సస్పెన్స్ కు తెరదించారు. అఖిల్ హీరోగా, నితిన్ నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా కాబటి మరింత ఆసక్తి నెలకొంది. అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ‘అఖిల్’ ఆడియో లాంచ్ ను ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ సరసన సయేషా హీరోయిన్ గా నటిస్తోంది.