యాక్సిడెంట్ తర్వాత తొలిసారి మాట్లాడిన సాయి తేజ్!
on Nov 24, 2021
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులలను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీ వేదిక 'జీ 5'లో ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సాయి తేజ్ ఓ ఆడియోను విడుదల చేశాడు.
'రిపబ్లిక్' సినిమా విడుదలకి కొద్దిరోజుల ముందు సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయలోనే సినిమా విడుదలైంది. ఇప్పుడు సాయి తేజ్ కోలుకున్నాడు. ఇటీవల మెగా హీరోలు అందరితో కలిసి దిగిన ఫోటోతో తాను పూర్తిగా కోలుకున్నానని తెలియజేశాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత ఇంతవరకు సాయి తేజ్ పబ్లిక్ తో మాట్లాడలేదు. ఇప్పుడు 'రిపబ్లిక్' మూవీ ఓటీటీలో విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ఆడియో క్లిప్ ద్వారా.. సాయి తేజ్ ప్రేక్షకులను పలకరించాడు.
"హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. 'రిపబ్లిక్' సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. 'జీ 5' ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి... మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్" అంటూ యాక్సిడెంట్ తర్వాత తొలిసారి పబ్లిక్ కి తన వాయిస్ ని వినిపించాడు సాయి తేజ్.
ఇది కూడా చదవండి: ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్‌టైమ్.. డైరెక్టర్ కామెంటరీతో విడుదలవుతున్న 'రిపబ్లిక్'