దృశ్యం`, `దృశ్యం 2`.. సేమ్ టు సేమ్!
on Nov 24, 2021
విక్టరీ వెంకటేశ్ నటించిన రీమేక్ సినిమాల్లో `దృశ్యం`(2014)కి ప్రత్యేక స్థానం ఉంది. తన కుటుంబం కోసం ఎంతకైనా తెగించే సగటు తండ్రి కథతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `దృశ్యం`(2013)కి తెలుగు వెర్షన్. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత `దృశ్యం`కి సీక్వెల్ గా `దృశ్యం 2` వస్తోంది. ఇది కూడా ఒరిజినల్ `దృశ్యం`కి సీక్వెల్ అయిన మలయాళ చిత్రం `దృశ్యం 2`కి రీమేక్ నే. అంతేకాదు.. ఒరిజనల్ తరహాలో రీమేక్ కూడా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. నవంబర్ 25న ఈ సినిమా ప్రీమియర్ కి సిద్ధమైంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు `దృశ్యం`, ఇటు `దృశ్యం 2` ఇలా రెండు సినిమాలు కూడా ఆయా దర్శకులకు తెలుగులో మొదటి చిత్రాలు కావడం విశేషం. `దృశ్యం`ని తెరకెక్కించిన ప్రముఖ నటి శ్రీప్రియకి తెలుగులో ఇదే ఫస్ట్ డైరెక్టోరియల్. అంతకుమందు ఆమె తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని ఐదు చిత్రాలు చేశారు. ఇక `దృశ్యం 2`ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ విషయానికి వస్తే.. తెలుగులో తనకిదే మొదటి ప్రయత్నం. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కలుపుకుని 13 చిత్రాలు చేసిన జీతూకి తెలుగు `దృశ్యం 2` 14వ సినిమా. మరి.. శ్రీప్రియకి మెమరబుల్ టాలీవుడ్ డెబ్యూగా `దృశ్యం` నిలిచినట్టే.. జీతూకి కూడా `దృశ్యం 2` తెలుగు రీమేక్ మెమరబుల్ టాలీవుడ్ డెబ్యూగా నిలుస్తుందేమో చూడాలి.