తమ్ముడు... తనయుడితో చిరంజీవి నటిస్తారా?
on Aug 29, 2019

తెలుగు సినిమా ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా దర్శకుల్లో పవన్ కల్యాణ్ వీరభక్తుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' సినిమా అతడికి దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకొచ్చింది. దర్శకుడిగా తొలి, మలి సినిమాలు మాస్ మహారాజ్ రవితేజతో తీసినా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' తీసినా... మెగా కాంపౌండ్ దర్శకుడిగా హరీష్ శంకర్ పై ముద్ర పడింది. పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్', మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్', అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాథమ్'... ఇప్పటివరకూ మెగా హీరోలతో మూడు సినిమాలు తీశాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'వాల్మీకి'లో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొత్తం మీద మెగా ఫ్యామిలీ హీరోలతో నాలుగు సినిమాలు చేశాడు. 'వాల్మీకి' విడుదలకు ముందు మనసులో మెగా కోరికను హరీష్ శంకర్ బయట పెట్టాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ హీరోలుగా మెగాపవర్ మల్టీస్టారర్ చేయాలని ఉందన్నాడు. ప్రస్తుతం పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ముఖానికి మేకప్ వేసుకున్నా... అన్నయ్య, తమ్ముడితో కలిసి నటిస్తారా? ముందు తమ్ముడు, తనయుడితో కలిసి నటించడానికి చిరంజీవి యస్ అంటారా? వెయిట్ అండ్ సి. హరీష్ శంకర్ కోరిక మాత్రం పెద్దదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



