హిలేరియస్ ఎంటర్టైనర్ `హనుమాన్ జంక్షన్`కి 20 ఏళ్ళు!
on Dec 21, 2021

తెలుగునాట స్నేహం చుట్టూ అల్లుకున్న పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `హనుమాన్ జంక్షన్` ఒకటి. మలయాళ చిత్రం `తెన్ కాశిపట్టణం` (సురేశ్ గోపి, లాల్, దిలీప్) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జగపతి బాబు, అర్జున్ స్నేహితులుగా నటించగా మరో కథానాయకుడిగా వేణు అలరించారు. స్నేహ, లయ, విజయలక్ష్మి నాయికలుగా నటించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్, వెన్నిరాడై నిర్మల, అలీ, కోవై సరళ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, రాళ్ళపల్లి, బేబి సుదీప ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా.. యువ కథానాయిక శ్రీ దివ్య బాలనటిగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం తమిళనాట స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్న మోహన్ రాజా.. ఈ సినిమాతోనే దర్శకుడిగా తొలి అడుగేయడం విశేషం.
Also Read:'హరిహర వీర మల్లు' కీలక అప్డేట్ వచ్చేసింది!
మాతృకకి సంగీతమందించిన సురేశ్ పీటర్స్.. తెలుగు వెర్షన్ కి కూడా బాణీలు అందించారు. ``కోనసీమల్లో ఓ కోకిల``, ``ఒక చిన్ని లేడీకూన``, ``గోల్ మాల్ గోల్ మాల్``, ``ఖుషి ఖుషిగా``, ``ఓ ప్రేమ ప్రేమ``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆదరణ పొందాయి. ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మాణంలోనే మోహన్ రాజా దర్శకుడిగా తొలి సక్సెస్ అందుకోవడం విశేషం. 2001 డిసెంబర్ 21న విడుదలై అఖండ విజయం సాధించిన `హనుమాన్ జంక్షన్`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read:ముంబై వీధుల్లో విజయ్, రష్మిక చక్కర్లు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



