`సుబ్బు`గా ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేసి నేటికి 20 ఏళ్ళు!
on Dec 21, 2021

కథానాయకుడిగా పరిచయమైన సంవత్సరంలోనే ముచ్చటగా మూడు సినిమాల్లో సందడి చేసి.. పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 2001 మేలో రిలీజైన `నిన్ను చూడాలని`తో హీరోగా తొలి అడుగేసిన తారక్.. ఆపై 2001 సెప్టెంబర్ లో విడుదలైన `స్టూడెంట్ నెంబర్ వన్`తో ఫస్ట్ సక్సెస్ చూశారు. ఆనక మరింత తక్కువ గ్యాప్ లోనే `సుబ్బు`తో అదే ఏడాది డిసెంబర్ నెలలో మూడో సినిమాతో పలకరించారు. `స్టూడెంట్ నెంబర్ వన్` తరహాలోనే `సుబ్బు`లోనూ కళాశాల విద్యార్ధిగా ఎంటర్టైన్ చేశారు ఎన్టీఆర్. కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాకపోయినా.. మ్యూజికల్ గా అప్పట్లో సంచలనం సృష్టించిందీ రొమాంటిక్ యాక్షన్ డ్రామా.
మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన ``మస్తు మస్తు సంగతుంది నీలో పోరి``, ``నా కోసమే``, ``జననీ జన్మభూమి``, ``ఎల్. ఓ. ఈ. పాసయ్యాను నీరజా``, ``వైవా వైవా``, ``హరీ హరా`` వంటి పాటలన్నీ అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. తారక్ కి జోడీగా సోనాలి జోషి నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఏవీయస్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బెనర్జీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సురేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆర్. శ్రీనివాస్, పి.ఎమ్. హరి కుమార్ నిర్మించారు. 2001 డిసెంబర్ 21న విడుదలైన `సుబ్బు`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



