'NBK 107'.. 'జై బాలయ్య'!
on Oct 12, 2021
`జై బాలయ్య`.. నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల నినాదం ఇది. ఇప్పుడీ నినాదమే.. బాలయ్య కొత్త చిత్రానికి టైటిల్ కాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ కథానాయకుడిగా `క్రాక్` దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాని రూపొందించనున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న శక్తిమంతమైన చిత్రమిదని సమాచారం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. నవంబర్ ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, `NBK 107` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి `జై బాలయ్య` అనే పేరుని నిర్ణయించినట్లు ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఈ టైటిల్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తాజా చిత్రం `అఖండ` విడుదలకు సిద్ధమైంది. ఇందులో బాలయ్య రెండు విబిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. బాలకృష్ణకి జంటగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించిన ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు.
Also Read