గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రివ్యూ
on Dec 16, 2016

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటిస్తుండటం, క్రిష్ ఫస్ట్ టైం ఇలాంటి సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటంతో సినిమా ఎలా వచ్చిందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలో బాలయ్య చక్రవర్తిగా ఎలా చేశాడు..పంచ్ డైలాగ్‌లున్నాయా లేదా..? విజువల్ ఎఫెక్ట్స్ మాటేమిటి అంటూ ఎదురుచూస్తున్న వారికి సమాధానంగా ఇవాళ విడుదల చేసిన ట్రైలర్‌లో సమాధానం దొరికిందా లేదా అన్నది చూస్తే.
"సమయం లేదు మిత్రమా..శరణమా..రణమా" అనే పవర్‌పుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్‌తోనే సినిమా అంతా యుద్దమే అని తెలుస్తోంది..బాలయ్య మార్క్ పంచ్ డైలాగ్‌లతో ట్రైలర్ మారు మోగిపోయింది. ఇక మహా వీరుడి తల్లిగా రౌద్రమూర్తిగా డ్రీమ్ గర్ల్ హేమమాలిని పవర్‌ఫుల్ యాక్టింగ్ చేశారు.. శాతకర్ణి భార్యగా శ్రీయ అన్ని రసాలను పండించినట్లుంది. ఇక ఈ ట్రైలర్‌లో ఎక్కడా విజువల్ ఎఫెక్ట్స్ వాడినట్లు కనిపించలేదు..మరి మెయిన్ పిక్చర్‌లో ఏమైనా వాడారా అన్నది వెండితెరపై చూడాల్సిందే. మొత్తానికి ట్రైలర్‌ను బట్టి సినిమాను చూడాలన్న క్యూరియాసిటి పెంచే ప్రయత్నంలో చిత్రయూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



