సూపర్ స్టార్‌పై ఓ సినిమా
on Aug 10, 2016

ఒ సాధారణ కండక్టర్ సూపర్ స్టార్‌గా ఎదిగిన అద్భుతం... రజనీకాంత్. ఆయన శైలి, ఆయన మాట, ఆయన జీవితం, ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శం. భారతదేశంలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకొంటున్న కథానాయకుల జాబితాలో రజనీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా రజనీకి అభిమానులున్నారు. ఫ్లాప్ సినిమా అయినా వంద కోట్లు సాధించగల చరిష్మా రజనీ సొంతం. అందుకే రజనీ అంటే అంత క్రేజ్!! ఇప్పుడు రజనీ జీవితాన్ని వెండి తెరపై తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం రజనీ కుమార్తె ఐశ్వర్య గతేడాది నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తోందట. రజనీ సన్నిహితుల్ని కలుసుకొని కొన్ని కీలకమైన విషయాల్ని సేకరించే పనిలో పడిందట. రజనీ గురించి ఇప్పటి వరకూ తెలియని విషయాలతో ఈ సినిమా సాగబోతోందని టాక్. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ఇలా దేశంలో ని అన్ని భాషలతో పాటు చైనీస్, జపనీస్‌లలో కూడా ఈ సినిమా తెరకెక్కించి ఒకేసారి విడుదల చేయాలన్నది ఐశ్వర్య ఆలోచన. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత ఎవరికి అప్పగించాలి? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాల్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని రజనీ భావిస్తున్నార్ట. రోబో 2 పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



