గౌతమి పుత్ర... తొలి వికెట్ డౌన్
on Aug 10, 2016

గౌతమి పుత్ర శాతకర్ణి కోసం హీరోయిన్‌ని ఎంపిక చేసుకోవడానికి నానా తిప్పలు పడింది... ఆ చిత్రబృందం. చివరికి వెటరన్ గాళ్ శ్రియని తీసుకొని మమ అనిపించారు. ఇప్పుడు ఈ టీమ్‌కి మరో తలనొప్పి పుట్టింది. ఈ సినిమాకి సంగీతం అందిచాల్సిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హఠాత్తుగా తప్పుకొన్నాడు. ఆ స్థానంలో సంగీత దర్శకుడ్ని వెదికి పట్టుకొనేందుకు వేట మొదలెట్టింది చిత్రబృందం. దేవిశ్రీ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే... సమయం సరిపోవడం లేదని, అనుకొన్న సమయానికి ట్యూన్లు ఇవ్వలేనని దేవి చెప్పాడట. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 12న విడుదల చేయాల్సిందే అంటూ బాలయ్య కంకణం కట్టుకొన్నాడట. సాధారణంగా ట్యూన్లు ఇవ్వడానికి దేవిశ్రీ పెద్దగా సమయం తీసుకోడు గానీ, ఆర్. ఆర్ విషయంలో పక్కాగా ఉంటాడు. ఆర్ ఆర్ కోసం కనీసం నెల రోజుల సమయం అయినా ఉండాలని అడిగాడట. అంత ఇవ్వలేం అన్నందుకే ఈ సినిమా నుంచి డీఎస్‌పీ డ్రాప్ అయిపోయాడట. మరి ఆ స్థానంలో ఎవరొస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



