తేజస్విని ఫోటోలో కౌశల్ మిస్సింగ్
on Oct 8, 2018
'బిగ్‌బాస్-2' విన్నర్ కౌశల్. అతని విజయం పట్ల ఎంతోమంది అభిమానులు సంతోషించారు. సంబరాలు చేసుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో టైటిల్ కోసం పార్టిసిపేట్ చేసిన మిగతా 16 మంది కంటెస్టెంట్లకు కౌశల్ విక్టరీ సంతోషాన్ని ఇచ్చినట్టు లేదు. హౌస్‌లో 16 మంది ఏకమై కౌశల్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆటలో భాగంగా, గెలుపు కోసం కౌశల్‌ని పక్కన పెట్టారని, అతడికి వ్యతిరేకంగా ఓటు వేశారని అనుకోవచ్చు. 'బిగ్‌బాస్' హౌస్ నుంచి బయ్యటకు వచ్చిన తరవాత కూడా కౌశల్‌ని ఆ పదహారు మందీ పక్కన పెట్టారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కౌశల్ ఈ విషయాన్ని వెల్లడించారు. "బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక... హౌస్‌మేట్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. నేను టైటిల్ విన్నర్ అని అనౌన్స్ చేసినప్పుడు ఒక్కరు కూడా నిలబడి చప్పట్లు కొట్టలేదు. గేమ్‌ని గేమ్‌గానే చూడాలి. కాని వారు అలా చూడలేదు. ఒక వ్యక్తి గెలుపును స్వీకరించలేని వాళ్ళను నేను అప్పడే వదిలేశా" అని కౌశల్ అన్నాడు.
హౌస్‌లో తనను తేజస్విని నానా మాటలూ అన్నదనీ, తనీష్ 'బయటకొచ్చాక నీ సంగతి చూస్తా' అని బెదిరించాడనీ, బాబు గోగినేనిని సొంత అన్నలా భావించి వ్యక్తిగత విషయాలు చెబితే బయటకు చెప్పాడనీ కౌశల్ చెప్పుకొచ్చాడు. తేజస్విని, బాబు గోగినేనిపై తనకు కోపం వుందని అతడు చెప్పాడు. బిగ్‌బాస్ షో పూర్తయ్యాక తేజస్విని సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేశారు. అందులో కౌశల్ తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ వున్నారు. 'నిజమైన విజేత ఎవరు?' అని ఆ ఫొటోకి ఒక కాప్షన్ ఇచ్చారు. అప్పుడే చాలామంది అర్థమైంది... కౌశల్‌ని అందరూ దగ్గరకు రానివ్వడం లేదని! మరోసారి కౌశల్ మాటలతో స్పష్టత వచ్చింది!!