'హీరో' సినిమాకి 'సూపర్ స్టార్' ఫ్యాన్స్ విజిల్స్ గ్యారెంటీ!
on Jan 6, 2022

తెలుగు ప్రేక్షకులకు మరో వారసుడు పరిచయమవుతున్నాడు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వస్తున్న అతని పేరు గల్లా అశోక్. ఓ వైపు తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడిగా.. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా 'హీరో' అనే సినిమాతో జనవరి 15 న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. సంక్రాంతికి ఇది కరెక్ట్ సినిమా అని, రెండు గంటలు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తామని అన్నాడు.
"మొదట ఈ సినిమాని జనవరి 26 న విడుదల చేద్దామనుకున్నాం. పలు సినిమాలు వాయిదా పడటంతో అదృష్టం కొద్దీ మాకు సంక్రాంతి డేట్ దొరికింది. అదృష్టం అని ఎందుకు అంటున్నాను అంటే.. ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా. పండగకి ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి ఎలాంటి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటామో అలాంటి సినిమా ఇది. రెండు గంటలు నవ్వుతూనే ఉంటారు. ఫుల్ ఎంటర్ టైన్ అవుతారు" అని శ్రీరామ్ ఆదిత్య అన్నాడు.

"అశోక్ కి ఇది ఫస్ట్ సినిమా అని ఎవరూ అనుకోరు. అంత బాగా చేశాడు. తన పర్ఫామెన్స్ నన్ను సర్ ప్రైజ్. మూవీ విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో చాలామంది నటులు మంచి రోల్స్ చేశారు. జగపతిబాబు గారైతే అదరగొట్టేశారు. ఆయన రోల్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి జగపతిబాబు గారికి అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో కృష్ణ గారి, మహేష్ గారి రిఫరెన్స్ లు ఉన్నాయా అని అందరూ అడుగుతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా విజిల్స్ వేసి, అరిచే సీన్స్ గ్యారెంటీగా ఉంటాయి." అని శ్రీరామ్ ఆదిత్య చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



