రవితేజకి విలన్‌గా తేజ హీరోయిన్!
on Jan 6, 2022

మాస్ మహారాజా రవితేజ ప్రీవియస్ మూవీ `క్రాక్`లో.. వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన లేడీ విలన్ రోల్ `జయమ్మ` ఎంత క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే.. `క్రాక్` రిలీజైన సంక్రాంతి సీజన్ లోనే సరిగ్గా ఏడాది తరువాత ప్రారంభం కాబోతున్న తన కొత్త చిత్రం `రావణాసుర`లోనూ అదే శైలిని కొనసాగించబోతున్నారట రవితేజ.
Also Read: 2022 కేరాఫ్ సీక్వెల్ మూవీస్!
ఆ వివరాల్లోకి వెళితే.. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా `రావణాసుర` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గుల పండక్కి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో లాయర్ గా ఎంటర్టైన్ చేయనున్నారు రవితేజ. కాగా, ఈ చిత్రంలో ముగ్గురు నాయికలకు స్థానముందట. అంతేకాదు.. ఓ లేడీ విలన్ రోల్ కూడా ఉందట. ఆ నెగటివ్ రోల్ లో దక్షా నగార్కర్ కనిపిస్తుందని బజ్. గతంలో సంచలన దర్శకుడు తేజ రూపొందించిన `హోరాహోరి` చిత్రంతో దక్ష తెలుగునాట నాయికగా గుర్తింపు పొందింది. రీసెంట్ గా `జాంబిరెడ్డి`లోనూ ఓ ముఖ్య పాత్రలో అలరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. త్వరలోనే `రావణాసుర`లో దక్ష ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Also Read: మహేశ్, తారక్, చరణ్ తరహాలోనే బన్నీకి కూడా..!
మరి.. తేజ హీరోయిన్ అయిన దక్ష.. రవితేజకి లేడీ విలన్ గా ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



