పండగ పూట.. పవన్ పాట..!
on Jan 6, 2022

`వకీల్ సాబ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా `భీమ్లా నాయక్`. మాలీవుడ్ సెన్సేషన్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో దర్శనమివ్వనున్నాడు. పవన్ కి జోడీగా నిత్యా మీనన్ కనిపించనుండగా.. రానాకి జంటగా సంయుక్తా మీనన్ నటిస్తోంది. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్, ``అంత ఇష్టం``, ``లాలా భీమ్లా``, ``అడవి తల్లి మాట```, ``లాలా భీమ్లా డీజే వెర్షన్``ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటికి కూడా మెగాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సంక్రాంతి కానుకగా `భీమ్లా నాయక్` నుంచి నెక్స్ట్ సింగిల్ ని విడుదల చేయబోతున్నారట. ఈ పాటని పవన్ స్వయంగా గానం చేశారని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
కాగా, ఫిబ్రవరి 25న `భీమ్లా నాయక్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



