'బాహుబలి' మరో ఘనత: రష్యన్ టీవీలో ప్రసారం!
on May 28, 2020
ప్రభాస్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ యస్.యస్. రాజమౌళి రూపొందించిన రెండు భాగాల 'బాహుబలి' మూవీ తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. ఇక ఇండియన్ సినిమా స్థాయి ఏమిటో అంతర్జాతీయంగా చాటింది. రెండో భాగం 'బాహుబలి: ద కన్‌క్లూజన్' మూవీ అయితే బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్‌టైమ్ టాప్ ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమా ఇప్పుడు మరో ఘనతను సాధించింది.
గురువారం రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ 'బాహుబలి: ద కన్‌క్లూజన్'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి, రష్యాలో ఒక టీవీ చానల్‌లో ఆ మూవీ ప్రసారమవుతోందని తెలిపింది. రష్యన్ భాషలో డబ్ చేసిన వెర్షన్ టెలీకాస్ట్ అవుతోందని అది వెల్లడించింది. ఆ వీడియోను షేర్ చేస్తూ, "రష్యాలో ఇండియన్ సినిమా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఇప్పుడు రష్యన్ టీవీ ప్రసారం చేస్తోంది ఏమిటో తెలుసా.. రష్యన్ వాయిస్ ఓవర్‌తో 'బాహుబలి' మూవీ" అని ఆ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
రష్యన్ ఎంబసీ ఆ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. ఇది భారతీయులకు గర్వకారణమంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. రష్యన్ ప్రేక్షకులు ఆ సినిమా ఇష్టపడుతుండటం తమకు చాలా సంతోషంగా ఉందంటూ 'బాహుబలి' ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
