'కేజీఎఫ్ 2' రిలీజ్ డేట్ రివీల్డ్
on Mar 13, 2020
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 2020 అక్టోబర్ 23న ఈ సినిమా విడుదలవుతున్నట్లు హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్.. ముగ్గురూ తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. అక్టోబర్ 25 దసరా పర్వదినం కావడం గమనార్హం. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత పోస్ట్ చేశాడు. చేతిలో గన్‌తో నిలబడి ఉన్న యష్ షాడో పిక్చర్, 'మే ఐ కమిన్' అనే క్యాప్షన్‌తో ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
2018లో కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టయి, దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కేజీఎఫ్' మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడంతో, వేసవి తర్వాత సినిమాలకు పెద్ద సీజన్ అయిన దసరా సెలవులకు మార్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడం ఆలస్యం, నిమిషాల వ్యవధిలో ఫ్యాన్స్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.
ఆసక్తికరమైన విషయమేమంటే, గత ఏడాది ఇదే రోజు.. అంటే 2019 మార్చి 13న ఈ మూవీ ఓపెనింగ్ బెంగళూరులో జరగటం. చాప్టర్ 1ను తెలుగు ప్రేక్షకులకు అందించిన సాయి కొర్రపాటి చాప్టర్ 2ను కూడా విడుదల చేయనున్నారు. ఒరిజినల్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి సీక్వెల్‌లోనూ నటిస్తుండగా, విలన్ రోల్‌ను సంజయ్ దత్ పోషిస్తున్నారు. రవీనా టాండన్, అయ్యప్ప శర్మ, రామచంద్రరాజు కీలక పాత్రలు చేస్తున్నారు.
Also Read