దిల్ రాజు పెళ్లికి ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్
on Feb 27, 2020
ప్రముఖ నిర్మాత దిల్ రాజు లేటు వయసులో ఘాటుగా పెళ్లి చేసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? ఆయన పెళ్లి పై ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? తదితర ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఇంగ్లీష్ డైలీ పేపర్ డెక్కన్ క్రానికల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మొన్న మంగళవారం ఆయన పెళ్లి చేసుకున్నాడు అనే వార్త రాసింది. దీనిపై దిల్ రాజు టీమ్ మండిపడింది. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదని ఘాటుగా ఆ పత్రిక వాళ్లకు ఒక ప్రెస్ నోట్ పంపింది. మీ కరస్పాండెంట్ కి ఇదే విషయం చెప్పినా ఎందుకు వార్త రాశారని ఘాటుగానే అడిగారు.
ఈ క్రమంలో ఒక విషయం కన్ఫామ్ చేశారు. అదేంటంటే.... కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ తో ఆయన పెళ్ళికి రెడీ అవుతున్నారు అని! సో... కుమార్తె నుండి గాని, ఇతర కుటుంబ సభ్యుల నుండి గాని పెళ్లి విషయంలో దిల్ రాజుపై ఎటువంటి అభ్యంతరాలు లేవన్నమాట. అదే సమయంలో మూడేళ్లుగా దిల్ రాజు ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజెంట్ దిల్ రాజు వయసు 50 ఏళ్ళు. అయినా ఆయన హ్యాండ్సమ్ అండ్ ఫిట్ గానే ఉంటారు. పెళ్లి ఆయన వ్యక్తిగత విషయం. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరేమన్నా పట్టించుకుంటారా?? త్వరలో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనేది కూడా బయటకి వస్తుంది.