విజయశాంతి .. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
on Aug 27, 2019
మహేష్ బాబు నటిస్తోన్న `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో చాలా గ్యాప్ తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నది రాములమ్మ. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియా లో న్యూస్ వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విజయశాంతి ఎంపికయ్యారని సమాచారం. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి, విజయశాంతి గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ న్యూస్ లో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.