క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ ఫీలింగ్!!
on Aug 27, 2019
క్యాస్ట్ ఫీలింగ్ మీదే సర్వం నడుస్తోన్న ఈ తరుణంలో క్యాస్ట్‌ని సగర్వంగా గొంతెత్తి చాటి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాలో సందర్భానుసారంగా వచ్చే క్యాస్ట్ ఫీలింగ్ పాటను పెట్టామంటూ... ఆ పాటను ఈ రోజు రిలీజ్ చేశారు వర్మ. ‘కులాభిమానం’ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం చేస్తున్నామంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
కమ్మలు, కాపులు, రెడ్లు, రాజులు, వైశ్యులు అంటూ సాగే ఈ పాట వీడియోలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, సియమ్ జగన్, రోశయ్య, ప్రభాస్, ఉండవల్లి విజువల్స్ వేయడం విశేషం. ఇక ప్రతి విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ కనబరుస్తూనే... క్యాస్ట్ ఫీలింగ్ లేదనే వారిపై సెటైర్ వేస్తూ క్యాస్ట్ ఫీలింగ్ పై తన ఫీలింగ్‌ని చెప్పుకొచ్చాడు దర్శకుడు వర్మ. సిరాశ్రీ రచించిన ఈ పాటను రవిశంకర్ స్వరపరచగా స్వయంగా దర్శకుడు వర్మనే ఆలపించారు. గతంలో కూడా ఈయన రక్త చరిత్రలో కత్తులతో సావాసం...అనే పాటను కూడా పాడారు. ఇక ప్రస్తుతం క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొంత మంది సానుకూలంగా, మరి కొంత ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఏం చేసినా సంచలనం చేసే వర్మ దీంతో ఎంత మందిలో చలనము తేనున్నాడో చూద్దాం మరి.