డీఎస్పీ ఖాతాలో మరో సంక్రాంతి హిట్ పడేనా!
on Jan 4, 2022

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అంటేనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్. తను బాణీలు అందించిన సినిమాల్లో నిరాశపరిచిన ఆల్బమ్స్ తక్కువనే చెప్పాలి. ఇక.. సంక్రాంతి సీజన్ లో వచ్చిన చిత్రాలైతే ఆల్మోస్ట్ మ్యూజికల్ గా మెప్పించినవే. అంతేకాదు.. కమర్షియల్ గానూ స్కోర్ చేసినవి కూడా. `వర్షం`(2004)తో మొదలుకుని `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`(2005), `అదుర్స్`(2010), `ఎవడు`(2014), `నేను శైలజ`(2016), `నాన్నకు ప్రేమతో`(2016), `ఖైదీ నంబర్ 150`(2017), `ఎఫ్ 2`(2019), `సరిలేరు నీకెవ్వరు`(2020) వరకు చెప్పుకోదగ్గ సంఖ్యలో సంక్రాంతి విజయాలు చూశాడు డీఎస్పీ.
ఇక ఇదే సీజన్ లో కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్స్ ఉన్నా.. మ్యూజికల్ గా మాత్రం మెప్పించాయి సదరు చిత్రాలు. `నా అల్లుడు` (2005), `1ః నేనొక్కడినే` (2014) ఈ తరహా సినిమాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఓ చిత్రంతో సందడి చేయనున్నాడు డీఎస్పీ. ఆ సినిమానే.. `రౌడీ బాయ్స్`. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా యువతరాన్ని ఆకట్టుకున్నాయి. మరి.. `రౌడీ బాయ్స్`తోనూ దేవి శ్రీ ఖాతాలో మరో సంక్రాంతి కమర్షియల్ హిట్ పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



