అర్థరాత్రి నుంచే రచ్చ షురూ.. దేవరతో మళ్ళీ మునుపటి రోజులు!
on Aug 27, 2024
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా విడుదల అంటే.. అర్థరాత్రి నుంచే థియేటర్ల దగ్గర సందడి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బెనిఫిట్ షోల ట్రెండ్ దాదాపు తగ్గిపోయింది. వీరాభిమానులు కూడా అందరితో పాటు, ఎర్లీ మార్నింగ్ షోలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి తరుణంలో మళ్ళీ బెనిఫిట్ షోల ట్రెండ్ కి శ్రీకారం చుడుతానంటోంది దేవర. (Devara Benefit Shows)
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా 'దేవర' (Devara). సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అసలుసిసలైన సినిమా పండుగను చూపించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారట. సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 1:08 నుంచే బెనిఫిట్ షోలు స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో బెనిఫిట్ షోలు పడతాయని వినికిడి. అలాగే ఓవర్సీస్ తో పాటు, ఇండియాలోని మేజర్ నగరాలలో కూడా 1:08 షోలు ఉంటాయని తెలుస్తోంది.
అసలే ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆయన నుంచి దాదాపు ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో ఫిల్మ్ దేవర. దానికితోడు థియేటర్లలో సరైన మాస్ బొమ్మ పడి చాలా కాలమైంది. ఓ స్టార్ హీరో నుంచి సరైన మాస్ ఫిల్మ్ వస్తే థియేటర్లలో ఎంజాయ్ చేయాలని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ దేవరకు కలిసి రానున్నాయి. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడిక బెనిఫిట్ షోలు కూడా తోడైతే.. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదవుతాయి అనడంలో సందేహం లేదు.
Also Read