దేని దారి దానిదే..దీపికా పదుకోణ్
on Jun 2, 2014
2013లో ఈ సుందరి పట్టిందల్లా బంగారమే అయ్యింది. 2014లో కూడా అవకాశాలకు ఏ కొదవా లేదు ఈ హీరోయిన్‌కి. అయినా ఈ క్రేజీ పనులెందుకో తెలియదు... గత ఏడాది వరుస హిట్లతో 500 కోట్ల బిజినెస్ బాలీవుడ్‌కి ఆర్జించి పెట్టిన భామ దీపికా పదుకోన్. బాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ, బ్యూటీ విత్ ద టాలెంట్ అని పేరు తెచ్చుకుంటున్న దీపికా పడుకొనే ఓ మేగజైన్ కోసం రెచ్చిపోయి ఫోజిచ్చింది. జవానీ హై దివాని, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీల చిత్రాలతో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపెసింది ఈ సొగసరి. అయినా మరి ఇలాంటి పోజులు ఇచ్చి క్రేజ్ కొట్టాయలనే తపన ఎందుకో తెలియదు.
ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై టూ పీస్ బికినీ వేసి హాట్ లుక్‌తో కనిపించింది. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన దీపికాకు బికినీలు కొత్త కాకపోవచ్చు. కానీ కవర్ పేజీ పై ఇంత స్పైసీగా ఆమె కనిపించడం చూస్తే వరుస విజయాలతో పాటు కుర్రకారు క్రేజ్ సంపాదించటం కూడా ముఖ్యమే అని దీపిక భావిస్తుందేమో అనిపిస్తుంది. డబ్బులు, విజయం, క్రేజ్ అన్నీ ముఖ్యమే అనే థాట్స్ ఎలా ఉన్నాదీపికా హాట్‌లుక్ మాత్రం అదిరిందనే అంటున్నారు. ఇంకా ఈ షూట్‌లో తీసిన మరిన్ని అద్భుతమైన స్టిల్స్ ఆ మ్యాగజైన్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్లు శాంతను, నిఖిల్, సబియాసాచి, మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన వివిధ దుస్తులు, బ్రైడల్ వేర్ వేసుకుని దీపిక ఈ షూట్‌లో హాట్ ప్రదర్శన ఇచ్చింది. దీపికా ఈ న్యూలుక్ కి అనైతా అదాజానియా స్టైలిస్ట్‌గా వ్యవహరించారు.