వాడుకున్నోళ్లకి వాడుకున్నంత
on Jun 3, 2014
.jpg)
పవన్ కళ్యాణ్.. ఆయన పవరేంటో అందరికన్నా ఎక్కువ యంగ్ హీరోలకి బాగా తెలుసు అనిపిస్తోంది. ఆయన పేరో, పాటో, డైలాగో, లేకపోతే కనీసం ఆయన చేతుల మీద ఏదో ఒక ప్రమోషన్ అయినా చాలని ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ పేరు జోడిస్తే చాలు పబ్లిసిటీ వచ్చి పడిపోతుంది, అలాంటిది ఆయన పేరు మీద ఒక ప్రమోషన్ సాంగ్ తయారు చేసి మరి పబ్లిసిటీకి వాడలనుకుంటున్నారు ఈ మెగాహీరో. వై.వి.యస్. చౌదరి నిర్మాతగా, పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘రేయ్’చిత్రం లో ఈ ప్రయోగం చేయబోతున్నారు. ఈ ఐడియా ఎవరిదైనా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి.
ఇదిగో అదిగో అంటున్న ఈ చిత్ర విడుదలకు ఈ పాటతో క్రేజ్ సంపాదించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ గురించి చంద్రబోస్‌తో ఆల్‌రెడీ పాట రెడీ చేయించారట. ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌లో ఈ పాట విడుదల చేస్తారని సమాచారం. 'రేయ్' సినిమా విడుదల ఆలస్యం అవుతున్న కొద్ది మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి పెరుగుతోందట నిర్మాతకు. ఈ నేపథ్యంలో ఈ పాట ద్వారా నయినా విడుదల చిక్కుల నుంచి రేయ్ సినిమా బయటకు వచ్చి తెర మీదకు వస్తుందేమో చూడాలి. నితిన్ సినిమాలో సాంగ్, బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమా 'బసంతి' ఆడియో లాంచింగ్, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలో ప్రమోషన్ సాంగ్... ఏమైనా పవన్ పవర్‌ని ఇలా వాడేసుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



