మెగా మూవీ ఫస్ట్ హాఫ్ పూర్తి.. ఈ స్పీడ్ ఏంటి రావిపూడి..!
on Mar 13, 2025
ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే జెట్ స్పీడ్ లో మూవీ వర్క్స్ జరుగుతున్నాయి. (Chiranjeevi)
ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. అదే ఉత్సాహంతో మెగాస్టార్ మూవీకి వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే తన టీమ్ తో కలిసి.. డైలాగ్ వెర్షన్ తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట. త్వరలోనే సెకండ్ హాఫ్ ని కూడా పూర్తి చేయనున్నారట. (Anil Ravipudi)
ఈ ఫిల్మ్ ని పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రావిపూడి. ఈ మూవీ కోసం చిరంజీవి 90 రోజులు కేటాయించారట. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.
ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ అవడంతో పాటు, ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చకచకా జరుగుతున్నాయి. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. తనదైన మ్యూజిక్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో.. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఫోక్ టచ్ తో అదిరిపోయే ట్యూన్ ఒకటి భీమ్స్ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో సాంగ్స్, మెగాస్టార్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
