'ఆదిత్య 999' డైరెక్టర్ చేంజ్.. మోక్షజ్ఞ డెబ్యూకి ముచ్చటగా మూడు!
on Nov 27, 2025

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఎవరు?
ఇప్పటికీ వీడని సస్పెన్స్
కొత్తగా తెరపైకి మరో దర్శకుడి పేరు
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ నటిస్తాడని, ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ చేంజ్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.
'ఆదిత్య 999' నుండి ఏవో కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నాడట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతికి వెళ్ళిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రావిపూడి.. చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రావిపూడి చేసే సినిమా 'ఆదిత్య 999' అంటున్నారు.
Also Read: చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. జై బాలయ్య..!
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'భగవంత్ కేసరి' అనే సూపర్ హిట్ ఫిల్మ్ వచ్చింది. ఆ సమయంలోనే మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ గురించి తెగ చర్చ జరగగా.. దర్శకుడిగా రావిపూడి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ప్రశాంత్ వర్మ సినిమా అధికారిక ప్రకటన రావడంతో.. అప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది.
రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు. సైన్స్‌ఫిక్షన్ తరహా జానర్స్ ఇంతవరకు టచ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'ఆదిత్య 999' డైరెక్టర్ గా ఆయన పేరు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



