షూటింగ్ టైమ్ లో వదలడం లేదట!
on Jul 13, 2016
ప్రతి మనిషికి ఏదో ఒక వ్యామోహం లేదా మోజు ఉంటుంది. అయితే.. అది పరిధి దాటనంతవరకూ ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే అది శృతి మించుతుందో అప్పుడే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు చరణ్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. స్వతహా చరణ్ కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం కాస్త ఈమధ్యకాలంలో వ్యామోహంలా మారింది. చరణ్ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొనే పెంపుడు కుక్కపిల్ల "బ్రాట్"ను ఈమధ్య షూటింగులకు కూడా తీసుకురావడం మొదలెట్టాడు. చూడడానికి చాలా ముద్దుగా ఉండే ఈ కుక్కపిల్ల సెట్ లో చేసే హడావుడి అంతాఇంతా కాదంట. చరణ్ మినహా షూటింగ్ లో యూనిట్ సభ్యులందరూ ఆ కుక్కపిల్లలు సంభాళించలేక సతమతమవుతున్నారని టాక్.
చరణ్ నటిస్తున్న "ధృవ" మూడో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింగ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకురానుంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
